Saturday, July 26, 2025

అశ్లీల కంటెంట్ ప్రసారం.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

దేశంలో అశ్లీల కంటెంట్‌పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒక మార్గంలో ఆ కంటెంట్‌ని ప్రసారం చేస్తున్నారు కొందరు. కొందరైతే.. అశ్లీల కంటెంట్ కోసం ఏకంగా యాప్స్‌ని తయారు చేసి.. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అలా అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న యాప్‌లపై (OTT Apps) కేంద్రం కొరడ ఝుళిపించింది. ఉల్లు, ఎఎల్‌టిటి సహా 24 యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

24 యాప్‌లు, (OTT Apps) వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ వెబ్‌సైట్లు, యాప్‌లు ఇంటర్నెట్‌లో కనిపించకుండా చేయానలి ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒటిటి ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్ విషయంలో బాధ్యతయుతంగా ఉండాలని పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

నిషేధించిన వెబ్‌సైట్లు ఇవే..
ఉల్లు, ఎఎల్‌టిటి, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్ ప్రైమ్, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టివి, హాట్‌ఎక్స్ విఐపి, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్ఎక్స్ విఐపి, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News