- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని విద్యార్థుల ఆందోళన చేపట్టారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు ధర్నా చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి నేత సాయి, సిఐ నల్లప్పకు స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పిపిపి మోడల్‌లో టెండర్లకు ఆహ్వానం పలికింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో మెడికల్ కాలేజీలకు పిపిపి విధానంలో నిర్మాణం చేయనుంది.
- Advertisement -