Sunday, May 4, 2025

విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

నిరుపేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ప్రత్యేక దృష్టి సారించిందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గుడిమల్కాపూర్‌లో హైదరాబాద్ 2వ ఎడ్యుకేషన్ ఎక్స్ పో 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్‌పో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిరుపేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించేందుకు ఇంటిగ్రెటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయ నుందని ఆయన తెలిపారు.

నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్ యూనివర్శిటీ, రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెనుకబడిన ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని, మైనార్టీ కమ్యూనిటీల్లో ఉన్నత వర్గాలు సైతం పేద ముస్లిం విద్యార్థులకు చేయూత అందించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అనంతరం ఎక్స్‌పోలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ అజీజ్, యూనిసెఫ్ చీఫ్ డాక్టర్ జీలేలం టాఫెస్సె, అబ్దుల్ ఖాదీర్, జునైద్ బహెల్మి, జీనత్ ఇక్బాల్, రెహన్ సూరి, ఐజాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News