మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి :బిసిలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యా య నిపుణుల సలహాల కోసం పంపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో రా ష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గవర్న ర్ వర్మ కేంద్రానికి పంపించగా, ప్ర స్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉం ది. రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన బిలు ను కేంద్రానికి పంపించినప్పుడు, మళ్లీ అదే అంశానికి సంబంధించి మంత్రివ ర్గం ఆమోదించి పంపించిన ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసే విషయంలో సందేహాలు లేకపోలేదు. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోదం తె లిపితే అది ఆర్డినెన్స్‌గా మారుతుంది. ఇదే సమయంలో రాష్ట్రపతి వద్ద కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తవా? అనే పలు అనుమానాలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణుల సలహా కోరినట్లు సమాచారం.
క్లిష్ట సమస్య గతంలో వచ్చిందా ?
అసలు ఇటువంటి క్లిష్టమైన సమస్య ఎప్పుడూ వచ్చి ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించి పంపిన తర్వాత, మళ్లీ అదే అంశంపై ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర పడితే, ఆర్డినెన్స్ బిల్లుగా మారేందుకు ఆరు నెలల గడువు ఉంటుంది. ఒక అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొంది, మళ్లీ అదే అంశానికి సంబంధించిన ఆర్డినెన్స్ అసెంబ్లీ ముందుకు రావడం అనేది ఎప్పుడైనా జరిగిందా?, ఇదే తొలిసారి క్లిష్టమైన పరిస్థితి వచ్చిందా? అనే చర్చ జరుగుతున్నది. ఆర్డినెన్స్ స్థానే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించినా, మళ్లీ గవర్నర్ వద్దకు ఆమోదం కోసం వెళ్ళాల్సిందే. అప్పుడైనా గవర్నర్ మళ్లీ కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది.
ఆర్డినెన్స్ ఆంతర్యం .. ?
ఇలా ప్రభుత్వం చేయడంలో ఆంతర్యం లేకపదోలేదు. ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోద ముద్ర లభించిన తర్వాత ఆ ఆర్డినెన్స్‌కు ఆరు నెలల్లోగా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం కోసం బిల్లు రూపేణా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కారణంతో ఆర్ఢినెన్స్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతే ఆ ఆర్డినెన్స్ ఆరు నెలల సమయం ముగియగానే ‘చెల్లుబాటు’ కాకుండా పోతుంది.
వ్యూహాత్మక అడుగులు..
అందుకే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వూహాత్మకంగా అడుగులు వేసి ఈ ఆర్డినెన్స్‌ను తీసుకుని వచ్చారు. ఆర్డినెన్స్‌కు ఉండే ఆరు నెలల గడువు ముగిసే లోగా స్థానిక సంస్థల ఎన్నికలను ముగించేయవచ్చని ఆయన అంచనా. గడువులోగా ఎన్నికలను పూర్తి చేస్తే ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు. స్థానిక సంస్థల ఎన్నికలను ముగించేస్తే తాను బిసి ఛాంపీయన్‌గా పేరు పొందవచ్చనేది ఆయన అభిమతమై ఉంటుందనేది స్పష్టమవుతున్నది.
ఆర్డినెన్స్‌కు మోక్షం లభించేనా ?
అసలు ఈ ఆర్డినెన్స్ ముసాయిదాకు మోక్షం లభిస్తుందా? లేదా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గత అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి చట్టబద్దత కోసం కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. బిసి బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, మళ్లీ ఆర్డినెన్స్ ఏమిటీ? అనే అనుమానాలను పలు బిసి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులూ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ విమర్శలు చేస్తుండగా, అదే పార్టీకి చెంది నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వాగతించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎందుకూ? కేంద్రంపై వత్తిడి తెచ్చి బిల్లుకు ఆమోదింపజేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో బయటపడుతుందని బిఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
కోర్టులో సవాల్. బిసి బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తేవడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని, కోర్టులో కూడా నిలబడదన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నాయి.