న్యూఢిల్లీ : రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విధులను నిర్వర్తించడానికి నిరాకరిస్తే, లేదా అసెంబ్లీ లు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ లు నిర్ణయా లు తీసుకోనకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన న్యాయస్థానాల చేతులు కట్టివేయవచ్చా అ ని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిం ది. కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన సొలిసిట ర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపిస్తూ, కొంతమంది గవర్నర్లు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోని పక్షంలోరాష్ట్రాలు న్యాయపరమైన పరిష్కారానికి బదులు, రాజకీయ పరిష్కారాన్ని అన్వేషించాల్సి ఉంటుందని సూచించారు. ఆ వాదన ఆలకించిన తర్వత చీఫ్ జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధ ర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగ ధ ర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, పిఎస్ నరహింహ, ఎఎస్ చందూర్కర్ ఉ న్నారు.అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను, గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదించేందుకు కాలపరిమితి విధించవచ్చా అన్న ప్రశ్నపై రాష్ట్రపతి సందించిన 14 ప్రశ్నలను ఈ ఐదుగురు జడ్జీలతో కూడిన ధ ర్మాసనం విచారిస్తున్నది. ఏదైనా తప్పు జరిగితే, దానికి ఓ పరిష్కారం కనుగొనాలికదా అన్నిధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎలాంటి కారణంలేకుండా తమ విధులను నిర్వర్తించక పోతే, రాజ్యంగం నిర్దేశించిన న్యాయస్థా నం చేతులు కట్టివేస్తారా అని సిజెఐ గవాయ్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అన్ని సమస్యలకూ కోర్టు గుమ్మం ఎక్కడం పరిష్కారం కాదని, అన్ని సమస్యలనూ కోర్టులు పరిష్కరించలేవని మెహతా అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేశారు. .
గవర్నర్ తగిన సమయంలో చర్య తీసుకోని పక్షంలో, బాధిత రాష్ట్రం ఆ అంశంపై కోర్టును ఆశ్రయిస్తే, అటువంచి నిష్క్రియాత్మకతపై న్యాయస్థానం సమీక్షించకుండా నిషేధించడం ఎంతవరకూ సబబు, మీ పరిష్కారం ఏమిటో చెప్పండి అని జస్టిస్ సూర్య కాంత్ మెహతాను నిలదీశారు. సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ, కొంత పట్టు విడుపులు ఉండాలన్నారు. గవర్నర్ బిల్లును ఆమోదించని పక్షంలో వెంటనే ముఖ్యమంత్రులు కోర్టులను ఆశ్రయించడం పరిష్కారం కాదు. గవర్నర్ ను కలిసి చర్చించవచ్చు. ప్రధాని, రాష్ట్రపతిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. చర్చల ద్వారా చాలా సమస్యలు పరిష్కారం కావచ్చు. ప్రతిష్టంభన తొలగించేందుకు టెలిఫోన్ సంభాషణలు జరిగాయని ఆయన వివరించారు. దశాబ్దాలుగా ఏ వివాదాలు తలెత్తినా పరిష్కారానికి చర్చల పద్ధతినే అవలంభిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
ప్రతినిధులు వెళ్లి గవర్నర్ , రాష్ట్రపతిని కలుస్తారు. కొన్ని సార్లు మధ్యేమార్గాన్ని కనుగొన బడుతుంది అన్నారాయన. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు కొంత రాజనీతిజ్ఞత, రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తే సరిపోతుందని మెహతా వివరించారు. గవర్నర్, రాష్ట్రపతి బిల్లులపై చర్య తీసుకోవడానికి రాజ్యాంగంలో ఎక్కడా కాలపరిమితి నిర్ణయించలేదని ఆయన గుర్తు చేశారు. ఏదైనా తప్పుజరిగితే దానికి పరిష్కారం కనిపెట్టాలని, ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ సంరక్షకుడు అని, అది రాజ్యాంగానికి సరైన అర్థం ఇస్తుందని, దానిని అర్థం చేసుకోవాలని అన్నారు. అదే సమయంలో తుషార్ మెహతా న్యాయబద్ధత వేరే విషయం అనీ, రాజ్యాంగంలో ఏదైనా జోడించడం వేరే విషయం అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కొంత కాలపరిమితిలోపు అలా చేయాలని నిర్దేశిస్తోందని, ఆ ఆదేశాలను తాను గౌరవించినా, అది కోర్టుకు అధికారపరిధిని ఇవ్వబోదని సొలిసిటర్ జనరల్ అన్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.