సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాలు
పోలీస్ స్టేషన్‌లో అదనపు గదులు లేక మహిళా సిబ్బంది అవస్థలు
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః పెంట్లవెల్లి మండలం జిల్లాల విభజనలలో భాగంగా నూతన మండలంగా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలే దిక్కయ్యాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కారాయలయాలకు వాల్మీకి ముదిరాజ్, వడ్డెర కులాల కమ్యూనిటీ భవనాలలోనే అధికారులు పబ్బం గడుపుతున్నారు. పోలీస్ స్టేషన్‌ను వాల్మీకి కమ్యూనిటీ హాల్లో కొనసాగించగా వాల్మీకి జయంతికి సమావేశాలను రోడ్లపైనే నిర్వహించుకుంటున్నారు.
గతంలోనే వాల్మీకి సంఘం నాయకులకు పోలీస్ స్టేషన్ ఖాళీ చేయమని కూడా కోరడం జరిగిందని సమచారాం. పోలీస్ స్టేషన్‌లో కేవలం రెండు గదులే ఉండడంతో ఒక గది ఎస్సైకి కేటాయించగా మరోక గదిలో కంప్యూటర్లు, సిబ్బంది ఉంటున్నారు. మండలం చిన్నదైనా పంచాయతీలు పెద్దవి ఉంటాయి. ప్రతి రోజు పోలీస్ స్టేషన్‌లో వివిధ పంచాయతీలపై పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు జనాలు రావడంతో స్టేషన్‌లో జనాలు పట్టక వడ్డెర కమ్యూనిటీ భవనాన్ని సమావేశాలకు సైబర్ క్రైమ్ కమ్యూనిటీ మీటింగ్లకు ఉపయోగించుకుంటున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు స్థల పరిశీలన చేసిన అడుగులు మాత్రం ముందుకు పడటం లేదు. అదే విధంగా ఎంపిడిఓ కార్యాలయాన్ని మూడు కిలోమీటర్ల దూరంలో ఎంఆర్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు అంత దూరం నడవలేక ఇబ్బందులకు గురవుతున్నారు.
స్టేషన్‌లో గదులు లేక ఇబ్బంది పడుతున్న మహిళా సిబ్బంది
పోలీస్ స్టేషన్‌లో కేవలం రెండు గదులు ఉండడంతో వేర్వేరుగా మహిళలకు, పురుషులకు గదులు లేక పగలు, రాత్రిళ్లు విధి నిర్వహణలో పాల్గొని సేద తీరటానికి అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటికి ఉన్న ఇబ్బందులు చాలాక మరుగుదొడ్ల సమస్య ఒకటి తాత్కాలిక మరుగుదొడ్లు వినియోగించుకోలేక వారి సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.