Friday, September 12, 2025

రూట్‌కి సవాల్ విసిరిన హేడెన్.. కూతురి అదిరిపోయే రిప్లై

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మరికొన్ని నెలల్లో ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌ కోసం ఇరు దేశాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్‌పై (Joe Root) ఉంది. రూట్ ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 2,400 పరుగులు చేస్తే.. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను దాటేసి.. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

అయితే యాషెస్‌లో సిరీస్ రూట్‌కి ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో అతను ఎంతో విలువైన పరుగులు సంపాదించుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ రూట్‌ని (Joe Root) రెచ్చగొట్టేలా ఓ సవాల్ విసిరాడు. ఒకవేళ యాషెస్‌లో రూట్ ఒక్క సెంచరీ కూడా చేయకపోతే.. తాను మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా అని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై విపరీతమైన స్పందన వచ్చింది. అభిమానులతో పాటు, హేడెన్ కుమార్తె, స్పోర్ట్స్ యాంకర్ గ్రేస్ హేడెన్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించింది. ‘‘ప్లీజ్ రూట్.. ఒక్క సెంచరీ అయినా చెయ్’’ అంటూ ఆమె కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ అవుతోంది. మరోవైపు.. ఆసీస్‌ గడ్డపై రూట్ ఇప్పటివరకూ ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.

Also Read : ఇది ప్రాజెక్టు సంజూ.. 21 సార్లు డకౌట్ అయినా సరే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News