Wednesday, April 30, 2025

ధాన్యం కొనుగోళ్లు ఇక చకచకా

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది అదనంగా మరో
1,151 కొనుగోలు కేంద్రాల
ఏర్పాటు 8,329కు చేరిన
కేంద్రాల సంఖ్య రాష్ట్రంలో
రికార్డు స్థాయిలో127 లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
70.13 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణే లక్షంగా ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడి అత్యధికంగా 127 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఉండడంతో కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. గతేడాది 7,178 కేంద్రా లు పనిచేయగా, రైతుల సౌలభ్యం కోసం, అకాల వర్షాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఈ ఏడాది 1,151 అదనంగా కేంద్రాలు ఏ ర్పాటుచేసి మొత్తం 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. ఇప్పటికే దాదాపుగా అ న్నిజిల్లాల్లోఅవి క్రియాశీలకంగాపనిచేస్తున్నా యి.

అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు రా వాల్సి ఉండడంతో అక్కడా తాత్కాలికంగా కొ న్నింటిని మాత్రమే ఏర్పాటుచేసింది. వాస్తవానికి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలు ఉండగా, వాటిలో 70.13లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ స్పెషల్ కమిషన్ డి.ఎస్.చౌహాన్ ఏర్పాట్లు చేశారు. గ్రామీణప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు అంశం రైతులకు సెంటిమెంట్ అంశం కావడంతో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. తరచుగా సివిల్ సప్లై స్పెషల్ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

11 జిల్లాల్లో వంద శాతం కేంద్రాలు

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పదకొండు జిల్లాల్లో నూ టికి నూరు శాతం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తుండడం గమనార్హం. అవి ఆదిలాబాద్, కామారెడ్డి, ఖ మ్మం, మహబూబాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట,సూర్యాపేట,వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఒక్క కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మా త్రమే 34 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా, వరి కోత లు ఆలస్యం కారణంగా ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభం కాలే దు. మిగతా ఇరవై జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు చురుకుగా పనిచేస్తున్నాయి.

రబీలో 57లక్షల ఎకరాల్లో వరి

ప్రస్తుత రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 57 లక్ష ల ఎకరాలలో రైతులు వరిపండించినట్లుగా అం చనా. సుమారు 127.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 5.77 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని లక్షంగా పెట్టుకున్నారు. ఏప్రిల్ 18వ తేదీ నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 2.74 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం చేరి ఉందన్నారు.

క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాం టి వివాదాలకు తావులేకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు(పిఎసిఎస్), ఇందిరా క్రాంతి పథం(ఐకేపి) గ్రూపుల ఆధ్వర్యంలో ధా న్యం కొనుగోలు కేంద్రాలు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత రైతులకు నగదు చెల్లింపులు వేగంగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ స్పెషల్ కమిషనర్ ఈమేరకు జిల్లా కలెక్టర్లకు, తమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చెల్లింపుల్లో ఎలాంటి జా ప్యం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News