అమరావతి: విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకే అప్పట్లో అధికారం కోల్పోయానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. విద్యుత్ సంస్కరణలు మొదట్లో ప్రారంభించింది తానేనని అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ను నిర్వహించారు. ఈ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్ పై దృష్టి పెట్టాలని చెప్పారు. గ్లోబల్ వార్నింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని, కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ కు (Green hydrogen) అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలియజేశారు. ఎపికి ఉన్న వనరులు సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ, సుదీర్ఘ తీరప్రాంతం అని ఏ రాష్ట్రానికి లేని వనరులు ఎపికి ఉన్నాయని అన్నారు. మన ఆలోచనలు, ఆవిష్కరణలు తెలుసుకోవడానికి వచ్చానని, సరికొత్త సాంకేతికత ఆలోచనలతో ముందుకెళ్తున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్రం గ్రీన్ హైడ్రోజన్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -