Sunday, July 27, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8 వ ఎడిషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కీసరగుట్ట మీద మొక్కలు నాటి ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్
నా జీవితాంతం కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించా : – సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరి అవసరం… దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చిన సంతోష్ కుమార్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఏడు వసంతాలుగా విజయవంతంగా ముందుకు వెళుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాఇలెంజ్ విసిరి మూడు మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరగా అది నేడు 20 కోట్లకు పైగా మొక్కలు నాటిన బృహత్కర కార్యక్రమమైంది. సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, రాజకీయాలకతీతంగా , కవులు, కళాకారులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక యజ్ఞంలా కొనసాగుతోంది.

గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ ఆదివారం కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. మొదట సంతోష్ కుమార్ మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కీసర గుట్ట పై మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8 వ ఎడిషన్ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ స్పూర్తితో ఈ యజ్ఞం ప్రారంభించానని అన్నారు. తన జీవితాంతం కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించానని అన్నారు.

కీసర ఫారెస్ట్ దత్తత తీసుకున్నానని, దాని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏడు సంవత్సరాలుగా ఇరవై కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని, అందరి ఆశీర్వాదంతో, అందరి మద్దతుతో ఇది సాధ్యమయిందన్నారు. దీనిని ఇలానే ముందుకు కొనసాగించాలని, మీ అందరి సహకారం కావాలని ఆశించారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, అకేషన్ ఏదైనా పుట్టిరోజు, పెళ్ళి రోజు, పెద్దల యాదిలో గాని మూడు మొక్కలు నాటి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఇది అందరి అవసరం ఖచ్చితంగా అందరము దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సంతన్న అంటేనే హరితహారం, సంతన్న అంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని అన్నారు. పచ్చని చెట్లు చూస్తే సంతోషంగా ఉంటుందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 7 వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

గీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.. ఈ కార్యక్రమం ద్వారా 20 కోట్ల పైగా మొక్కలు నాటారు ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి అనేక అవార్డులు వచ్చాయి. పార్లమెంట్ లో కూడా సంతోష్ కుమార్ ప్రశంసలు అందుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంతోష్ కుమార్‌కి అభినందలు తెలిపారు.ఆ కీసర రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్లాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో కీసర మాజీ సర్పంచ్ మాధురీ వెంకటేష్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,రజినీ సాయి చంద్, సుమిత్రానంద్ తనోబా, హరిత సేన రాష్ట్ర కో ఆర్డినేటర్ సతీష్, రాజు, డాక్టర్ మార్కండేయులు, మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News