- Advertisement -
న్యూయార్క్: అమెరికాలోని గ్రీన్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొట్టడంతో హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవదహనమైంది. కారులో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులు హైదరాబాద్లోని కొంపల్లి వాసులుగా గుర్తించారు. బెజిగం వెంకట్(40), చొలేటి తేజస్విని(36), సిద్ధార్థ(09), మృదా(07) వెకేషన్ కోసం అమెరికాకు వెళ్లారు. మూడు సంవత్సరాల క్రితం వెంకట్ ఉద్యోగం నిమిత్తం డాల్లస్ లో ఉంటున్నారు. ఆరు నెలల క్రితం భార్యను అమెరికాకు తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులు పశుపతి నాథ్, గిరిజన కూడా అమెరికాకు తీసుకెళ్లాడు. పిల్లలకు సెలవులు రావడంతో అట్లాంటాలోని తన మామ నాగరాజు ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చి ట్రక్కు కారును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.
- Advertisement -