- Advertisement -
జిఎస్‌టి మండలి 56వ సమావేశం నేడు (బుధవారం) ప్రారంభం కానుంది. 2017లో జిఎస్ టి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇది అతి పెద్ద పన్ను సంస్కరణలలో ఒకటిగా భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు హాజరవుతారు. నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేకపోతే ఓటింగ్ ద్వారా తీసుకుంటారు. కేంద్రానికి 33 శాతం, రాష్ట్రాలకు కలిపి 67 శాతం ఓటింగ్ శక్తి ఉంటుంది. ఈ సమావేశంలో రెండు స్థాయిల రేట్ల నిర్మాణం పరిశీలనలో ఉంది. ప్రస్తుత 12 శాతం, 28 శాతం రేట్లను రద్దు చేసి, 5 శాతం (తక్కువ రేటు), 18 శాతం (ప్రామాణిక రేటు)గా మార్చే ప్రతిపాదన ఉంది. లగ్జరీ కార్లు వంటి వాటిపై 40 శాతం జిఎస్‌టి విధించే అవకాశం ఉంది.
- Advertisement -