న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త, మధ్యతరగతి, అల్పాదయవర్గాలవారు ఎక్కువగా వినియోగించే వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం చేసే లక్ష్యంతో 12శాతం జిఎస్టీస్లాబ్‌లో ఉన్నవస్తువుల్లో కొన్నింటిపై పన్ను పూర్తిగా తొలగించడం, 5శాతానికి తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తోంది. మధ్యతరగతి, బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనే దృష్టి పెట్టా రు. పన్నుతగ్గనున్న వస్తువులలో టూత్‌పేస్ట్, టూత్‌పౌడర్, గొడుగులు, కుట్టుమిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్‌లు, తక్కువ సామర్థ్యం గల వాషింగ్ మిషీన్లు, సైకిళ్లు, 1000 రూపాయలకన్నా ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ వస్తువులు,
500 నుంచి 1000 రూపాయలలోపు ధరఉంటే చెప్పులు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణా లు, వంటి చాలా వస్తువులు ఉన్నాయి. ఈ చర్య వల్ల ప్రభుత్వం పై రూ.40 వేలకోట్ల నుంచి 50 వేల కోట్ల భారం పడుతుంది. అయితే ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వస్తు వినియోగం పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు వచ్చింది. దీనివల్ల తక్కువ ధరలు అమ్మకాలు పెరుగుతాయని, చివరికి పన్ను బేస్, దీర్ఘకాలిక జిఎస్టీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్య ఓ ఇంటర్ వ్యూలో జీఎస్టీ రేట్లలో మార్పులు చేసే ప్రతిపాదన ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచిస్తోందని, చాలా వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని తెలిపారు.