అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధం ఉండాలని ఛాలెంజ్ చేశారు. విశాఖలో భూకేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 99 పైసలకు వందల కోట్ల భూములు కట్టబెడుతున్నారని, రియల్ ఎస్టేట్ సంస్థలకు వేలకోట్ల భూములు అప్పగించారని దుయ్యబట్టారు. చంద్రబాబు లోక నాయకుడు కాదు లోక మాయకుడు అని ధ్వజమెత్తారు. దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు సింగపూర్ టూర్ వెళ్తున్నారని అమర్నాథ్ ఆరోపణలు చేశారు. 30 ఏళ్లలో చంద్రబాబు 58 సార్లు సింగపూర్ వెళ్లారని, అవినీతి సొమ్ముతో సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టారని విమర్శలు గుప్పించారు. రియల్‌ఎస్టేట్‌పై చంద్రబాబు, లోకేష్ కు ఆరాటం ఎందుకు అని ప్రశ్నించారు. అదానీ డేటా సెంటర్‌పై లోకేష్ గొప్పలు చెప్పారని, డేటా సెంటర్ వైసిసి హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అమర్నాథ్ మండిపడ్డారు.
దోచుకున్నది దాచుకోవడానికే బాబు సింగపూర్ వెళ్తున్నారు: గుడివాడ
- Advertisement -
- Advertisement -
- Advertisement -