Sunday, May 18, 2025

యుసిసి అవసరం మదింపునకు గుజరాత్ యత్నం

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ : గుజరాత్‌లో ఏక శిక్షా స్మృతి (యుసిసి) అవసరాన్ని మదింపు వేసేందుకు, ఒక ముసాయిదా బిల్లు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు (ఎస్‌సి) విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని మంగళవారం ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ 45 రోజుల్లోగా తన నివేదికను సమర్పిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలియజేశారు. ‘ఏక శిక్షా స్మృతి (యుసిసి) ఆవశ్యకతను మదింపు వేయడానికి, దానికి ఒక ముసాయిదా బిల్లు రూపొందించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం’అని ఆయన తెలిపారు. నివేదిక అందిన తరువాత యుసిసి అమలు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కమిటీలోని ఇతర సభ్యులు విశ్రాంత ఐఎఎస్ అధికారి సిఎల్ మీనా, న్యాయవాది ఆర్‌సి కొడేకర్, సామాజిక కార్యకర్త గీతా ష్రాఫ్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News