గాంధీనగర్: సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందని ఓ యువతిని యువకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం భుజ్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… గాంధీధామ్‌లోని భరత్‌నగర్‌లో మోహిత్ సిద్ధపారా(22) అనే యువకుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. యువకుడి ఇంటి పక్కన మరో యువతి ఉంటుంది. ఇరుగుపొరుగు ఇండ్లవారు కావడంతో అందరి కలిసిమెలిసి ఉంటున్నారు. పరిచయం ఇద్దరు మధ్య ప్రేమగా మారింది. కొన్ని రోజులు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
Read Also: తీర్పులపై వక్రభాష్యాలు.. ఇదేం తీరు?
తల్లి సలహా మేరకు యువతి మోహిత్ నంబర్‌కు వాట్సప్, ఫేస్‌బుక్, ఫోన్ నంబర్ ను కూడా బ్లాక్ చేసింది. ఈ విషయం మోహిత్ తట్టుకోలేక ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేశావని యువతిని మోహిత్ ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతు కోశాడు. అడ్డుగా వచ్చిన యువతి స్నేహితుడిని కూడా కత్తితో గాయపరిచాడు. వెంటనే ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కచ్ ప్రాంతంలో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.