- Advertisement -
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(IPL) భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో(Delhi Capitals) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujrat Titans) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కి దూసుకువెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫ్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని ప్రతీ ఒక్క అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఒక మార్పు చేయగా.. ఢిల్లీ రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి రబాడా రాగా.. ఢిల్లీ జట్టులో మాధవ్ తివారీ స్థానంలో విప్రాజ్ నిగమ్, స్టార్క్ స్థానంలో ముస్తవిజూర్ జట్టులోకి వచ్చారు.
- Advertisement -