Monday, September 15, 2025

‘ఒజి’ నుంచి మరో పాట.. ‘గన్‌ అండ్ రోజెస్’ అదిరిపోయిందిగా..

- Advertisement -
- Advertisement -

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గన్‌ అండ్ రోజెస్’ (Guns n Roses) అనే పాటను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ పాట పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. యానిమేషన్‌లో ఉన్న ఫైటింగ్ సీక్వెన్స్‌లు ఈ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకంపై డివివి దానయ్య నిర్మించారు. థమన్ సినిమాకు సంగీతం అందించారు. (Guns n Roses)

Also Read : ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News