Friday, July 11, 2025

భారీ వర్షాలతో గురుగ్రామ్ జలదిగ్బంధం

- Advertisement -
- Advertisement -

రాత్రి కురిసిన భారీ వర్షాలతో గురుగ్రామ్ జలమయం అయింది. పలు ప్రాంతాలలో మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. దీనితో వేలాది మంది ఇళ్లకు పరిమితం కావల్సి వచ్చింది. గురువారం గురుగ్రామ్‌లో అధికారులు జాగ్రత్త చర్యలకు సూచనలు వెలువరించారు. కార్పొరేట్ ఆఫీసులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనికి దిగారు. ఈ ఆకాశహార్మాల నగరంలో అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ ఆగింది. నగరపు దక్షిణ ప్రాంతపు రహదారిపై బీరు సీసాలతో వెళ్లుతున్న ట్రక్కు గుంతలు పడ్డ రోడ్డులో కూరుకుపోయింది. దీనితో బీరు బాటిల్స్‌ను రక్షించుకునేందుకు డ్రైవర్ ప్రయత్నించాల్సి వచ్చింది. ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రాంతానికి చేరుకున్న క్రేన్ సాయంతో అతి కష్టం మీద ట్రక్కును పైకి లాగారు. పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాయి. బుధవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో వర్షం ఆరంభం అయింది. రాత్రింతా పడుతూనే ఉంది. 12 గంటల వ్యవధిలో నగరంలో 133 మిమిల వర్షపాతం రికార్డు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతానికి ఐఎండి ఆరంజ్ అలర్ట్ వెలువరించింది. ఇక్కడి జాతీయ రహదారులలో ఆరు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయని నగర ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్థితిని తెలిపే ఫోటోలను పెట్టారు. హర్యానాలోని ఇతర ప్రాంతాలు అంబాలా, హిసార్, కర్నాల్ , రొహతక్ , భివానీలలో కూడా భారీ వర్షాలు పడ్డాయని అదికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News