Saturday, July 19, 2025

చెట్టుకు ఉరేసుకుని గురుకుల విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం (బైపిసి) చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ శనివారం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం, ఆరేపల్లి గ్రామానికి చెందిన సంతోష్ ఉదయం కళాశాల ఆవరణలో నిర్వహించిన వ్యాయామంలో పాల్గొన్నాడు. కళాశాలకు వెళ్లడానికి స్నానం చేసి వస్తానని స్నేహితులతో చెప్పి టవల్ తీసుకుని కళాశాల గోడ దూకి కళాశాల గ్రౌండ్ వెనుక గల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సహచర విద్యార్థులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News