Thursday, September 11, 2025

గురువారం రాశిఫలాలు (11-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరీ ఊపిరి పీల్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. స్వల్ప ధన లాభ సూచన.

వృషభం – క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కీలక నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మిథునం – అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంది.  ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు.

కర్కాటకం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.   వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది.

సింహం – ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.  ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. నూతన పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు అవసరం.

కన్య – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారే సూచనలు ఉన్నాయి. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరే దిశగా శుభవార్తలు అందుతాయి.

తుల – కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా ప్రవర్తించి అన్ని విధాల ఆలోచన చేసి శుభకార్యాల విషయాన్ని ఓ కొలిక్కి తెస్తారు.

వృశ్చికం – వృత్తి ఉద్యోగాలపరంగా చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని కార్యాలయంలో సహ ఉద్యోగులు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటారు.

ధనుస్సు – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. దీర్ఘకాలిక రుణాలను గడువుకుముందే తీర్చి వేస్తారు.  యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు మీకు లాభిస్తాయి.

మకరం – అనవసరమైన విషయాలలో కాలయాపన చేస్తున్న మీ ఆత్మీయ వర్గాన్ని మందలించి దారిలో పెడతారు. మీ మనస్సాక్షికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది.

కుంభం – స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబంలోనూ,బంధువులలోనూ కొంత అలజడి సృష్టిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. మానసిక సంతృప్తి కలుగుతుంది.

మీనం – కార్యాలయంలో నిష్కారణంగా మిమ్ములను వేధిస్తున్న ఓ అధికారి ట్రాన్స్ఫర్ కావడం మీకు ఊరట కలిగిస్తుంది. దురాశకు పోయి నష్టపోయినటువంటి ఆత్మీయులను ఆదుకుంటారు.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News