Wednesday, August 13, 2025

కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరగలేదా?:గువ్వల బాల రాజు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరగలేదా? అని ఇటీవల బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. ఓట్ల చోరీ జరిగిందంటూ హడావుడి చేస్తున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా దీనికి సమాధానం చెప్పాలని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని శక్తులు మన దేశ రాజకీయాలను దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నట్లు స్పష్టమైన సూచనలు కేంద్రానికి అందాయని ఆయన తెలిపారు. ఇందులో రాహుల్ గాంధీ, జార్జ్ సోరస్,

శ్యాం తదితరులు ఈ కుట్రలో భాగస్వాములని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. నాయకులు చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో అనేక పార్టీలు బిసి రిజర్వేషన్ల కోసం ఎన్నికల ముందు మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోవడం పరిపాటి అయ్యిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బిసి రిజర్వేషన్ల కోసం హడావుడి చేస్తూ డ్రామా చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవలంభించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ అవలంభిస్తున్నదని గువ్వల బాలరాజు విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News