- Advertisement -
హైదరాబాద్: ఆపత్కాలంలో బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కొందరు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala bala raju) తెలిపారు. పార్టీ మారుతున్నాననే సమాచారం తెలిసి మోహరించారని అన్నారు. ఆదివారం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర రావు సమయంలో భారతీయ జనతా పార్టీలో గువ్వల బాలరాజు చేరారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడారు. తాను కాపాడదలుకున్నది తాను త్యాగం చేయదల్చుకున్నది పేదల కోసం అని, పేద వర్గాలను (Poor communities) ఎవరు కాపాడుతారో వారితోనే జతకడతానని తెలియజేశారు. ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించడంతో తాను బిజెపిలో చేరానని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ విఫలమైందని ఆరోపణలు చేస్తున్నారని, ప్రపంచానికి ఎంత గొప్ప హెచ్చరిక చేశారో తెలియకుండా విమర్శస్తున్నారని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -