Friday, July 25, 2025

కన్వరియాలపైకి దూసుకెళ్లిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా- ముంబై నేషనల్ హైవేపై శివపురి లింక్ రోడ్డులో కారు అతివేగంతో కన్వరియాల (శివ భక్తులు) పైకి దూసుకెళ్లడంతో నలుగురు భక్తులు చనిపోయారు. ఈ ప్రమాదంలో  గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. భదావనంలోని ఒక శివాలయం నుంచి గంగాజలం సేకరించి సిమారియా గ్రామానికి తిరిగి వస్తున్న కన్వరియాల బృందాన్ని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టి (Hit by car) బోల్తాపడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి టైరు పేలడం వల్ల ఈ ఘటన ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కన్వరియాలు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరగడానికి గల కారణం అతివేగమేనని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News