Monday, June 16, 2025

ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ను లోబర్చుకుని మోసం.. జిమ్‌ ట్రైనర్‌ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రేమ పేరుతో జిమ్‌ ట్రైనర్‌ తనను లోబర్చుకుని తర్వాత మోసం చేశాడని ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… ప్రేమిస్తున్నానని చెప్పి జిమ్‌ ట్రైనర్‌ మహేష్‌.. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను నమ్మించి లోబర్చుకున్నాడు. తర్వాత రెండేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి రూ.15 లక్షలు తీసుకుని మొహం చాటేశాడు. ఈ క్రమంలో అతనికి ఇదివరకే పెళ్లి అయినట్లు తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసినట్లు గుర్తించింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహేష్‌ను ఆరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News