Monday, July 21, 2025

లాటరీ విధానానికి స్వస్తి!

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ డిసి: ఇక ముందు జారీ చేసే హెచ్ -1బి వీసాల కేటాయింపులో గణనీయమైన మార్పులు చేయాలని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యోచిస్తోంది. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు వెయిటెడ్ ఎంపిక ప్రక్రియను అన్వేషిస్తున్న ట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సె క్యూరిటీ (డిహెచ్‌ఎస్) సమాచార, రెగ్యులేటరీ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం హె చ్-1బి వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి, జారీ తరువాయి చేస్తున్నారు. దీని వల్ల నైపుణ్యం, వీసా పొందుతున్న వారి సాంకేతిక అర్హతలు, యాజమాని ఎవరు అన్నది చూడకుండానే వీసాలు జారీ అ వుతున్నాయి. ప్రతి సంవత్సరం 85,000 హెచ్ -1బి వీసాలను పరిమితంగా మంజూరు చేస్తున్నారు. అమెజాన్, మేటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్దపెద్ద టెక్ సంస్థల ద్వారా సమర్పించిన దరఖాస్తులే తరచు పెద్ద సంఖ్యలో ఆమోదం పొం దుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్స రానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని అమె రికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.

అమెరికా ప్రె సిడెంట్‌గా డోనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వలసవిధానంలో వీసా కార్యక్రమం ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం వలసల నియంత్రణకు కఠినమైన నియమ నిబంధనలు,ఆంక్షలు అనుసరిస్తుండడం ఓ కారణం. ఎలాన్ మస్క్ వంటి నిపుణులు హెచ్ -1బి వీసా వ్యవస్థను కొత్త ఆవిష్కరణకు కీలకమైనదిగా భావించడం మరో కారణం. అయితే డిహెచ్‌ఎస్ అనుసరిస్తున్న విధానం అమెరికాలో కార్మి క వ్యవస్థలో పెను మార్పులు సృష్టిస్తుందని భావిస్తున్నారు. కాగా, అమెరికన్ కంపెనీలు మాత్రం స్థానికంగా సిబ్బందిని నియమించడం లో ఇబ్బందులు పడుతున్నాయి. కానీ, ప్రత్యేక మైన నిపుణులను నియమించుకోవడానికి కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News