Saturday, August 16, 2025

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటరీ విభాగం అధిపతి మృతి

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : గాజాపై తాము ఇటీవల చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేత, మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మరణించినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సదరన్ కమాండ్ నాయకత్వంలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేతను హతమార్చినట్టు ఇజ్రాయెల్ బలగాలు ధ్రువీకరించాయి. మూసా హమాస్ సైనిక నియంత్రణ విభాగానికి అధిపతిగా పని చేశాడు. ఇజ్రాయెల్ దళాలు, పౌరులపై దాడుల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో హమాస్ సైనికులకు శిక్షణ ఇచ్చేవాడు. హమాస్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్‌కు సన్నిహిత అనుచరుడిగాను కొనసాగాడని ఐడీఎఫ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News