Tuesday, September 2, 2025

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి ఇవ్వడం పెద్ద కుట్ర :ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి ఇవ్వడంలో పెద్ద కుట్రదాగి ఉందని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణకు వచ్చే వంద ఏళ్ళు నష్టం కలిగించే కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషం చిమ్మారని అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి లేఖతో ఎన్.డి.ఎస్.ఏ వచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా కేసులు వేసిన చంద్రబాబు కుట్ర సిబిఐ విచారణ వెనుక ఉందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా అధికారులు ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి అధికారులను బెదిరించారని ఆరోపించారు. పి.సి.ఘోష్ కమీషన్ మహాదేవ్ పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎందుకు విచారణ చేయలేదని అడిగారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు పి.సి.ఘోష్ కమీషన్ రిపోర్టు ఇచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ,చంద్రబాబు స్క్రిప్టును రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి కుట్రలపై బిఆర్‌ఎస్ పోరాటం చేస్తోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News