Saturday, August 2, 2025

రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. రూ.3,800 కోట్లతో హంద్రీవా పనులు చేపట్టామని, త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతాం అని తెలియజేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు అనేదే ఉండదని, రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఉపాధి కోసం యువత వేరే ప్రాంతాలకు (Youth other areas) వెళ్లాల్సిన అవసరం రాకూడదని, త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతాయని హామీ ఇచ్చారు. 2028 డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేస్తామని, రేపు అన్నధాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎపి రూ. 14 వేలు, కేంద్రం రూ. 6 వేలు మొత్తంగా రైతులకు రూ. 20 వేలు ఇవ్వబోతున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News