బెంగళూరు: బుల్లితెరను నటిని ఆమె భర్త కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని హనుమంతనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 20 సంవత్సరాల క్రితం నటి మంజుల ఆటో డ్రైవర్ అమరేశ్(49)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
జులై 4న భార్యను భర్త కత్తితో పొడిచి పారిపోయాడు. తన భార్యపై దాడి విషయం దాడి పెట్టి ఆమె చికిత్స పొందుతుందని డిసిపి గిరీశ్‌కు సమాచారం ఇచ్చారు. కట్నం కోసం వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాల విక్టోరియా వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. భార్య కంట్లో పెప్పర్ స్ప్రే చల్లి తొడ, పొత్తి కడుపు, తదితర ప్రాంతాలలో అమరేశ్ పొడిచారని పోలీసులు వివరించారు. పోలీసులు అమరేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.