Friday, July 25, 2025

కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎంఎల్‌ఎ కెటిఆర్‌కు సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. కెటిఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.

కెటిఆర్ 48వ బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పేదలు బట్టలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడిపై తమకున్న ప్రేమను చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News