Friday, May 30, 2025

‘ఎందుకు రిటైర్ అయ్యావ్’.. కోహ్లీకి స్టార్ క్రికెటర్ కూతురు ప్రశ్న..

- Advertisement -
- Advertisement -

టెస్ట్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు విరాట్ కోహ్లీ(Virat). అతడు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది సమర్థించినా.. మరికొందరు మాత్రం ఎందుకు అప్పుడే రిటైర్‌మెంట్ అని ప్రశ్నించారు. అలాగే ఓ చిన్నారి కూడా కోహ్లీని తన టెస్ట్ క్రికెట్ రిటైర్‌మెంట్ గురించి ప్రశ్నించింది. ఆ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan) కూతురు. కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత అందరిలాగేనే హర్భజన్ కూతురు హినాయా కూడా ఆవేదనకు గురైంది.

అందుకే నేరుగా తను విరాట్‌నే సెల్‌ఫోన్‌లో ప్రశ్నించిందని హర్భజన్ (Harbhajan) తెలిపారు. ‘‘నేను కూడా కోహ్లీని రిటైర్‌మెంట్ గురించి అడిగాను. మా కూతురు కూడా దీని గురించి నన్ను ప్రశ్నించింది. కోహ్లీకి ‘విరాట్, వై డిడ్‌ యు రిటైర్’ అని మెసేజ్ చేసింది. దీనికి కోహ్లీ (Virat) ‘బేటా, ఇట్స్ టైం..’ అంటూ రిప్లై ఇచ్చాడు’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ఇక శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కానీ, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సవాళ్లతో కూడినది అని.. యువ జట్టు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News