Saturday, September 13, 2025

బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ పదవికి టీం ఇండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం త్వరలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ పదివీ బాధ్యతలు చేపడతారని.. వార్తలు వచ్చాయి. కానీ, వాటిని సచిన్ టీమ్ ఖండించింది. తాజాగా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), కిరణ్ మోరె పేర్లు వినిపిస్తున్నాయి. హర్భజన్‌కు అయితే పదవీ బాధ్యతలు వస్తాయని క్రికెట్ వర్గాల అనుకుంటున్నాయి. అందుకు సంకేతంగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ హర్భజన్ సింగ్‌ను తమ తరఫున ఎజిఎంకు నామినేట్ చేసింది.

మరోవైపు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎజిఎంకు హాజరవుతారు. ఒకవేళ హర్భజన్‌ (Harbhajan Singh) బిసిసిఐ అధ్యక్షుడిగా ఎంపిక అయితే.. ప్రపంచకప్‌ గెలిచిన జట్టు సభ్యుడికి ఛాన్స్ వచ్చినట్లు అవుతుంది. 2007 టి-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో హర్భజన్ సభ్యుడిగా ఉన్నారు. సౌరవ్, రోజర్ కూడా ఇలా ఎంపిక అయిన వాళ్లే. హర్భజన్‌తో పాటు మాజీ క్రికెటర్ కిరణ్ మోరె పేరు కూడా అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. వెస్ట్ జోన్ నుంచి ఈపారి అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు.

Also Read : ఇది ప్రాజెక్టు సంజూ.. 21 సార్లు డకౌట్ అయినా సరే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News