Sunday, June 29, 2025

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). ఎపి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే. దీంతో చాలా రోజులుగా బిగ్ స్క్రీన్ పై పవన్ ను మిస్ అయిన అభిమానులు.. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ.. అనుకోని కారణాల వల్ల విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. దీంతో ఈనెల 21న చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక, తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ను జూలై 3న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత కీరవాణి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News