Wednesday, August 20, 2025

ఓటిటిలోకి ‘హరి హర వీరమల్లు’.. డేట్ ఫిక్స్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హిస్టారికల్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’ ఓటిటిలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ… ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. రేపటి(ఆగస్టు 20) నుంచి స్ట్రీమింగ్ కానుందని.. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.

కాగా, డైరెక్టర్ క్రిష్‌ ఈ మూవీని కొంత భాగం తెరకెక్కించి తప్పుకోవడంతో మిగతా సినిమాను జ్యోతికృష్ణ రూపొందించారు. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ నటించింది. బాబీ డీఓల్, నర్గీస్‌ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 24న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మద్య వచ్చిన ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. స్టోరీ బాగున్నా.. సెకండాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం, కొంత సాగదీత సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News