పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు. ఈ జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల సుందరి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలమాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే నిధి అగర్వాల్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమాపై పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొదట వైజాగ్ లో ఈ వేడుకను జరపాలని భావించారు. అయితే, పలు కారణాల వల్ల ఈ వేడుకను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.