- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్.. మరో వారం రోజుల్లో విడుదల కానున్న ‘హరిహర వీరమల్లు’ వాయిదా పడింది. శుక్రవారం ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ సినిమా జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. అయితే, అకస్మాత్తుగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన నిర్మాణ సంస్థ.. అభిమానులకు షాకిచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని అందుకే మూవీని వాయిదా వేస్తున్నామని.. త్వరలో ట్రైలర్ తోపాటు కొత్త రిలీజ్ డేట్ ను తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.
- Advertisement -