Saturday, December 9, 2023

టిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెబుతా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao comments on Modi govt

కరీంనగర్: టిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో తాను వంద కారణాలు చెబుతానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. గెల్లు శ్రీనివాస్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, టిఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బిజెపికి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలని అడిగారు. మోడీ ప్రభుత్వం బడా ప్రారిశ్రామికవేత్తలకు పది లక్షల కోట్ల రూపాయల పన్నును మాఫీ చేసిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలైనా రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర కేంద్రం రూ.1000కి పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 30వ తారీఖున ఓటు వేయడానికి వెళ్లే ముందు ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకొని వెళ్లి ఓటు వేయాలని హరీష్ పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా పోరాడుతున్నారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News