Friday, May 16, 2025

అసలు క్రిమినల్ రేవంతే: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో తెలంగాణాను దెబ్బతీయడానికి తెలంగాణ ద్రోహులందరూ ఏకమవుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను క్రిమినల్ అంటున్న రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారని, అధికారంలోకి వస్తే తెలంగాణానే అమ్మేస్తాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగిరితే, అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటికీ, కరెంటుకూ కొరత లేదనీ, ఆడపిల్ల పెళ్లికి అడ్డంకులు లేవనీ, కొట్లాటలూ, కర్ఫ్యూలు లేవని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News