Sunday, August 24, 2025

బిఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదు: హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

తొమ్మిదిన్నరేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఏనాడూ యూరియా కొరత రాలేదు.. ఏనాడూ రోడ్డెక్కాల్సిన దుస్థితి రాలేదని హరీష్‌రావు తెలిపారు. యూరియా కొరతకు కారణమైన వారే ఇప్పుడు యూరియా పేరు చెప్పి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పేరిట రెండు నెలలు పాలనను గాలికి వదిలేసిండు తప్ప, ఎరువులు, విత్తనాల గురించి సిఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయలేదని, బాధ్యత లేదు, ప్రణాళిక లేదు, కార్యచరణ లేదని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలనే సోయి కూడా లేకుండా ప్రతి వైఫల్యాన్ని బిఆర్‌ఎస్, కెసిఆర్‌పై వేస్తూ రంకెలేయడం తప్ప 22 పాలనలో సిఎం రేవంత్‌రెడ్డి ఒరగబెట్టిందేమిటి..? అని ప్రశ్నించారు. యావత్ రైతాంగాన్ని యూరియా కోసం నడి రోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు.

సాగు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, పంట కొనుగోళ్లలో ఫెయిల్, రూ.500 బోనస్ ఇవ్వడంలో ఫెయిల్,రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిల్,రైతు రుణమాఫీలో ఫెయిల్,చివరకు యూరియా సరఫరా చేయడంలో ఫెయిల్…రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులతో కాళ్లు మొక్కించుకుంటున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుందని అన్నారు. రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద నిందలు మాని, రైతుల యూరియా కష్టాలపై ఇప్పటికైనా దృష్టి సారించాలని సూచించారు. యూరియా, ఎరువుల కొరతపై సమీక్ష నిర్వహించి, రైతాంగానికి అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని బిఆర్‌ఎస్ పక్షాన హరీష్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News