హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైఫ్యలం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదని అన్నారు. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బిఆర్ఎస్ నేతలు వ్యవసాయ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేశామని అన్నారు.
బిజెపి, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని విమర్శించారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలని, యూరియా ఎప్పటిలోపు పంపిణీ చేస్తారో చెప్పకపోతే ఇక్కడి నుంచి కదలనివ్వమని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ తీసుకొని చెబితేనే.. ఇక్కడి నుంచి బయటకెళ్తామని తెలియజేశారు. తాము రాజకీయాల కోసం రాలేదని, రైతుల కోసం వచ్చాం అని హరీష్ రావు పేర్కొన్నారు. యూరియా కొరత తీర్చాలంటూ అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. నినాదాలు చేయొద్దని బిఆర్ఎస్ ఎంఎల్ఎలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ నుంచి వ్యవసాయశాఖ కమిషనర్ ఆఫీస్‌కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు.
Also Read : మొదట్నుంచి గోపీనాథ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు: కెటిఆర్