Friday, September 5, 2025

ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రజలకు సేవ చేయడమే మాజీ సిఎం కెసిఆర్ నేర్పించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి కెసిఆరే సుప్రీం అని ప్రశంసించారు. లండన్ లో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందరర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చు అని తెలియజేశారు. హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఎన్నారైలు పెట్టుబడులు పెట్టడం లేదని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Also Read :  మహా గణపతికి నీరాజనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News