Sunday, July 27, 2025

మాటలు కాదు చేతలు కావాలి : హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. నాగర్ కర్నూల్ లో ఉయ్యాల వాడలోని బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి పాయిజన్ కలిసి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. సాంబారులో కూడా పురుగులు వస్తున్నాయని చెప్తున్నారని అన్నారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి మాపై కోపం ఉంటే జైల్లో పెట్టండి. కానీ విద్యార్థుల భవిష్యత్తుతో (future students) ఆడుకోవద్దు అని సూచించారు.

గురుకురాల్లో మెనూ ప్రకారం తిండి పెట్టడం లేదని, రేవంత్ రెడ్డి నుంచి మాటలు కాదు చేతలు కావాలని మండిపడ్డారు. కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలుంటాయని సిఎం అన్నారని, సిఎం రేవంత్ రెడ్డి మాటలు అధికారులు వినడం లేదా? అని నిలదీశారు. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్, హైకోర్టు సుమోటుగా తీసుకోవాలని చెప్పారు. హస్టళ్లలో పిల్లలకు కడుపునిండా తిండి పెట్టండని, విద్యార్థుల సమస్యలపై చర్చించడానికి సిఎంకు సమయం లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News