పాత చింతకాయ పచ్చడిలా ఉత్తమ్ ప్రసంగం..సరిగ్గా
ప్రిపేర్ అయి రాలేదేమో ఎన్‌డిఎకు జేబు సంస్థగా
ఎన్‌డిఎస్‌ఎ పోలవరం కొట్టుకుపోయినా..ఇప్పటికీ
రిపోర్టు ఎందుకివ్వలేదు ఎన్నికలు వచ్చినప్పుడల్లా
కాళేశ్వరంపై నివేదికలు రాజకీయాల పేరిట రైతుల
గొంతు కోయొద్దు : బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరంపై ఎన్‌డిఎస్‌ఎ ఇచ్చిన నివేదిక మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మా ట్లాడినవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలా రా జకీయ ప్రసంగాన్నే కొనసాగించారని విమర్శించారు. ఉత్తమ్ మాటల్లో కొత్త సంగతి లేదని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ప్రె స్ మీట్ జర్నలిస్టులకు కూడా పరీక్ష పెట్టినట్టు ఉందని పేర్కొన్నా రు. డ్యామ్ సేఫ్టీ బిల్లు వచ్చినప్పుడు బిఆర్‌ఎస్ కూడా పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారని, కానీ అప్పుడు ఆ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందని చెప్పారు.
ఆనాడు వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ బిల్లును బైబిల్, ఖురాన్, భగవత్ గీత అని ప్రవచనాలు ఇస్తున్నారని విమర్శించారు. ఆనాడు రాంగ్ అయిన బిల్లు ఇప్పుడు కరెక్ట్ ఎలా అయ్యిందో ఉత్తమ్ చెప్పాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కాళేశ్వరంపై ఎన్‌డిఎస్‌ఎ నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌పై స్పందించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టులో అవినీతి జరిగినట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేశారన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఎల్లెంకల పడ్డారని ఎద్దేవా చేశారు.
ఒక్కో ఎన్నిక వచ్చినప్పుడు ఒక్కో రిపోర్టు ఇస్తుంది
ఎన్‌డిఎస్‌ఎ కాళేశ్వరంపై ఒక్కో ఎన్నిక వచ్చినప్పుడు ఒక్కో రిపో ర్టు ఇస్తుందని హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక,ఇప్పుడు బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ముం దు తుది నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఇది ఎన్‌డిఎస్‌ఎ నివేదిక కాదు కాంగ్రెస్, బిజెపి పార్టీల రాజకీయ ప్రేరేపితి నివేదిక అని విమర్శించారు.
ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఎన్‌డిఎస్‌ఎ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్‌డిఎస్‌ఎ ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రమంతటా బిఆర్‌ఎస్ రజతోత్సవ, కెసిఆర్ ప్రసంగంపై చర్చ జరుగుతోందనే అక్కసుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు కలిగించినా బిఆర్‌ఎస్ సభ సక్సెస్ అయిందని చెప్పారు. సభకు జనాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఊరు వాడా తేడా లేకుండా, పల్లె పట్టణం తేడా లేకుండా అంతా కెసిఆర్ ప్రసంగంపైనే ఇంకా చర్చ కొనసాగుతోందని అన్నారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను డైవర్ట్ చేసేందుకు భారత్ సమ్మిట్‌తో రైతు మహోత్సవాలు చేసినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. కెసిఆర్ గర్జనకు కాంగ్రెస్ కకావికలం అయ్యిందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ఘటనలు జరిగిన రోజు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. కానీ ఎన్నికల్లో బిజెపికి లబ్ది చేకూరేలా మేడిగడ్డ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు ఇచ్చిందని ఆరోపించారు. పోలవరంలో డయాఫ్రాములు కొట్టుకుపోయాయని, కానీ నాలుగైదు సంవత్సరాలు అయినా ఎందుకు రిపోర్టు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్‌డిఎ హయాంలో కట్టిన పోలవరం కుప్పకూలినా ఎందుకు అక్కడకు వెళ్లలేదని అడిగారు. అన్ని ప్రాజెక్టులకు రూల్ ఒకే విధంగా ఉండాలని అన్నారు.
ఎన్‌డిఎస్‌ఎను కూడా ఇడి, సిబిఐ లాగా వాడుతున్నారు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్‌డిఎస్‌ఎ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థగా చెబుతున్నారని, కానీ ఎన్‌డిఎస్‌ఎను కూడా ఎన్‌డిఎ ప్రభుత్వం ఇడి, సిబిఐ లాగా వాడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కై చేస్తున్న పని అని పేర్కొన్నారు. కాళేశ్వరం డిజాస్టర్ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, కానీ ఎస్‌ఎల్‌బిసి కంటే పెద్ద డిజాస్టర్ ఏముంటుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుంకిశాలతో పాటూ చాలా ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని విమర్శించారు. తమ్మిడిహెట్టికి ఎందుకు అనుమతులు తేలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర, ఎపి, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా తమ్మిడిహెట్టికి ఎందుకు అంతర్ రాష్ట్ర ఒప్పందం చేయలేదని అడిగారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా..? అని ప్రశ్నించారు. కమిషన్ల కోసం, పర్సంటీజీల కోసం టెండర్లు పిలిచి, ఎక్కడో చేవెళ్ల కాడ తవ్వారని ఆరోపించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ తప్పును సరిచేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మళ్లీ సిగ్గులేకుండా ఉత్తమ్ మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ పార్టీ అన్యాయంగా తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు అన్నారని, 8 ఏళ్లలో ఎందుకు పర్మిషన్ తేలేదని అడిగారు. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో చర్చలు జరిపి కెసిఆర్ మాట్లాడారని, తాను వెళ్లి ముషారఫ్ అనే ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహారాష్ట్రతో చర్చలు జరుపుతూనే ఉన్నామని తెలిపారు. తాము ప్రయత్నాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అనడంతో తుమ్మడి హెట్టి నుంచి వేరే చోటుకు తప్పని పరిస్థితిలో మార్చామని వివరించారు. నీళ్లు ఉన్న చోట్ల మేడిగడ్డ వద్దకు మార్చామని చెప్పారు. ప్రత్యామ్నాయం కూడా తాము చేయలేదు అని, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద కట్టాలని చెబితే కట్టామని అన్నారు. 220 టీఎంసీల నీళ్లు తీసుకునే అనుమతి సిడబ్లుసి నుంచి సాధిం,ఆమని, ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది అంటున్నారని, కానీ 16 నుంచి 141 టిఎంసీలకు సామర్థ్యం పెంచిందని, ఆయకట్టు రెండింతలైందని వివరించారు. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టిఎంసీలకు పెంచామని చెప్పారు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని మార్చామని అన్నారు. ఆర్‌ఇసి దగ్గర అప్పు తెచ్చినం అంటున్నారని, కానీ వాళ్ల లాగా 170 కోట్లు బ్రోకర్‌కు ఇచ్చి అప్పులు తేలేదని విమర్శించారు. బ్రోకర్‌కు పైసలు ఇచ్చి,హెచ్‌సియు భూములు కుదువ పెట్టి పది వేల కోట్లు తెచ్చారని ఆరోపించారు. తాము తప్పు చేస్తే తమకు కేంద్ర ప్రభుత్వం ఎలా అప్పు ఇచ్చిందని అడిగారు. అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కారు రేవంత్ సర్కారు అని, ఇంతకంటే దివాళాకోరు తనం, దిక్కుమాలిన తనం ఉండదు అంటూ ధ్వజమెత్తారు.
రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయవద్దు
రాజకీయాల పేరిట రైతుల గొంతు కోయవద్దని హరీష్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. దయచేసి రైతుల వైపు చూడాలని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు ఎంతో ఉన్నాయని, వర్షాలు లేకుంటే మంచి నీళ్లు కూడా దొరకవు అని పేర్కొన్నారు. వేగవంతంగా ప్రాజెక్టును పునరుద్దరించాలని చెప్పారు. రాజకీయాలు ఎన్నికలకు ఆరు నెలల ముందు చేద్దాం అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని, ఆరువేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పెద్దవాగు తెగిపోయింది, ఎస్‌ఎల్‌బిసి కుప్ప కూలింది, వట్టెం వాగు కొట్టుకుపోయింది అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలనలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ నీటి పారుదల శాఖ ఎంత దీన స్థితిలో ఉందని,
30 ఇఎన్‌సి, సిఇ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే 57 సూపరింటెండెంట్ ఇంజినీర్ల పోస్టులకు గాను 40 ఖాళీ ఉన్నాయని చెప్పారు. సెక్షన్ 3 నదీ జలాల మీద ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతుంటే, పూర్తి స్థాయి సిఈ, ఎస్‌ఇ లేరని, డిప్యూటీ ఇఇ మాత్రమే హాజరవుతున్నారని చెప్పారు. వారికి ఫ్లైట్ చార్జీలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు మీద కేబినెట్‌లో కాకుంటే ఏఐసీసీలో చర్చించినా తాము భయపడం అని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి దగ్గర కట్టి తీరుతా అన్నారని, ఏడాదిన్నర అవుతున్నా తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ఇప్పటికైనా మేడిగడ్డను రిపేర్ చేసి, రైతులకు న్యాయం చేయాలని హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.