Friday, May 2, 2025

అవి కాంగ్రెస్ ఐటీ సెల్ వికృత చేష్టలు:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఐటీ సెల్ కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓ పత్రికా క్లిప్‌లో హరీష్ రావు బీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోవడం, కొత్త పార్టీ పెట్టడం, బీజేపీలో చేరడం ఏదో ఒకటి జరగడం తథ్యం అని వార్తను రాసి..దానిని కాంగ్రెస్ ఐటీ సెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని కాంగ్రెస్ నేతలు షేర్ చేసూ. హరీశ్ రావుకు ట్యాగ్ చేశారు. కాగా కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారంపై స్పందించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై,

ఆ పార్టీ ఐటీ సెల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయర ఎక్స్ ద్వారా స్పందిస్తూ‘ పాలన చేతగాదు, సమాధానం చెప్పే దమ్ము లేదు, కానీ దుష్ప్రచారంలో నెంబర్ వన్ కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారా చేస్తున్న ఇలాంటి వికృత చేష్టలు దివాలాకోరు, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే, చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తమని హెచ్చరిస్తున్నాం.‘ అని రాసుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News