సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులైనా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిగాచి పరిశ్రమ బాధితులను కలిసి అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హరీశ్ మీడియాతో మాట్లాడారు. సిగాచి పరిశ్రమ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. ప్రభుత్వ తీరు తూ తూ మంత్రంగా ఉందని మండిపడ్డారు. రేవంత్ ప్రకటించిన కోటి రూపాయిల విరాళం ఇంకా ఇవ్వలేదని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఎనిమిది మంది ఆచూకీ లభించకపోతే.. బూడిద తీసుకువెళ్లి అంత్యక్రియలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచూకీ దొరకని వారికి డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 54 మంది చనిపోతే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని.. బాధితులకు ఎప్పుడు ఎక్స్‌గ్రేషఇయా ఇస్తారో క్లారిటీ లేదని హరీశ్ ధ్వజమెత్తారు.
సిగాచి ప్రమాదం.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: హరీశ్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -