సిద్ధిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యకం చేశారు. బుధవారం ఆయన సిద్ధపేట జిల్లా రాఘవాపూర్‌లో పర్యటించారు. ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులను చూసి పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారను. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒటిపి, ఒక బస్తా విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. సబ్సిడి ఇచ్చే విషయంలో తప్పించుకునేందుకే ప్రభుత్వం కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బిహార్‌కు ఎరువులు తరలిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపికి బుద్ధ చెప్పాలని పేర్కొన్నారు.
అంతకు ముందు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీశ్ రావు (Harish Rao) లేఖ రాశారు. కాళేశ్వరం కింద ఉన్న జలాశయాలు నింపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం ఆరో ప్యాకేజీ ఉణ్న మోటార్లు ఆన్ చేయలని కోరారు. జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.