మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో మరోసారి హరీశ్ రావు భేటీ అయ్యారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కెసిఆర్‌తో హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో మూడోసారి హరీశ్‌రావు కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, కాళేశ్వరం కమిషన్ విచారణకు కెసిఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. జూన్ 5న పీసీ ఘోష్ కమిషన్ ముందు కెసిఆర్ విచారణను ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కెసిఆర్, హరీశ్ రావులు సమావేశమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రస్తుతం విచారణ చేస్తోంది. ఈ క్రమంలో కెసిఆర్, హరీశ్ రావు, బిజెపి ఎంపి ఈటల రాజెందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 5న కెసిఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ నోటీసులు ఇచ్చింది.