- Advertisement -
కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌తో మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి భేటీ అయ్యారు. విచారణలో భాగంగా మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు మంగళవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల మాజీ సిఎం కెసిఆర్‌తో ఎర్రవల్లి నివాసంలో హరీష్‌రావు సమావేశం కాగా, గురువారం మరోసారి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కెసిఆర్, హరీష్‌రావు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నోటీసులకు ఎలా స్పందించాలన్న అంశంపై ఇరువురు మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే, కమిషన్ ముందు కెసిఆర్, హరీష్‌రావులు విచారణకు హాజరవుతారా..? లేదా లేక తమ ప్రతినిధి ద్వారా కమిషన్‌కు సమాధానం ఇస్తారా…అనేది తెలియాల్సి ఉంది.
- Advertisement -