కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు కెసిఆర్‌తో సమావేశమైన హరీష్‌రావు, తాజాగా బుధవారం మరోమారు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లి ఆయన కెసిఆర్‌తో సమావేశమై కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కెసిఆర్‌తో పాటు హరీష్ రావు,
ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న తేదీన కెసిఆర్, 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. నోటీసుల నేపథ్యంలో కెసిఆర్ ఇప్పటికే న్యాయనిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. నోటీసులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాలు, తదితరాల గురించి చర్చించినట్లు తెలిసింది.